Select Location
All Locations
State
Region
City / District
మొదలుకాని ‘పత్తిపాక రిజర్వాయర్’ పనులు

మొదలుకాని ‘పత్తిపాక రిజర్వాయర్’ పనులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిధిలో పత్తిపాక రిజర్వాయర్​నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌‌‌‌‌‌‌‌సిగ్నల్​ ఇచ్చి రెండేళ్లయినా ఇంకా పనులు మొదలుకాలేదు. రిజర్వాయర్​ నిర్మాణాన్ని ప్రభుత్వం రిజర్వ్‌‌‌‌‌‌‌‌లో పెట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్​నిర్మాణం కోసం డీపీఆర్​రెడీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సీడబ్ల్యూసీకి అనుగుణంగా డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేయాలని ఆదేశిస్తూ గతేడాది ఫండ్స్‌‌‌‌‌‌‌‌ కూడా కేటాయించారు. కానీ ఇప్పటివరకు డీపీఆర్​ కూడా రెడీ పూర్తికాలేదు.

గత సర్కార్​ కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ కింద ఉన్న ఆయకట్టు భూములకు నీరందించాలనే ఆలోచనతో రిజర్వాయర్​నిర్మాణం చేయాలనుకుంది. దానికోసం ధర్మారం మండలం పత్తిపాక వద్ద రిజర్వాయర్​ నిర్మించాలని గత సర్కార్​ ప్లాన్​ చేసింది. దానికోసం ఎన్ని టీఎంసీల సామర్థ్యంతో కట్టాలనే దానిపై కచ్చితమైన నిర్ణయానికి రాలేదు.

దీంతో పత్తిపాక నిర్మాణం మూలనపడిపోయింది. కాంగ్రెస్​పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా సర్కార్​ ఏర్పాటైన వెంటనే ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పత్తిపాకపై క్లియరెన్స్​ ఇచ్చారు. దీంతో జిల్లా మంత్రితో కలిసి ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు రిజర్వాయర్​ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రిజర్వాయర్​ పూర్తి స్థాయి డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.


V6 News 1 hour ago
Home Flash News