రాజస్థాన్ రిఫైనరీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతులు మీదిగా ప్రారంభం కానున్న ఆయిల్ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రధాని మోదీ మంగళవారం (ఏప్రిల్ 21, 2026) రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బలోత్రాలోని పచ్‌పద్రలో దేశపు తొలి గ్రీన్‌ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను దేశానికి అంకితం చేయనున్నారు. రూ.79,450 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ భారత్ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అంచనా.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే,ఇప్పుడీ ఈ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్న తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్.ఇందులో క్రూడ్ ఆయిల్‌ను రిఫైన్ చేయడమే కాకుండా,పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారు కానున్నాయి.