ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: చంద్రబాబు
చెన్నై: తమిళనాడులో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘‘కేంద్రంలో మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తున్నప్పుడు వినియోగించుకోవాలి కదా. సంక్షేమ కార్యక్రమాల కోసం చెన్నైకి కేంద్రం రూ.14 లక్షల కోట్లు ఇచ్చింది.
కేంద్ర నిధులను దారి మళ్లించడం సమంజసమా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాలి. దేశానికి నరేంద్ర మోదీ వంటి సమర్థ నాయకత్వం ఉంది. సరైన సమయంలో మంచి ఆలోచన చేయాలని తమిళనాడు ప్రజలను కోరుతున్నా. సమర్థులను ఎన్నుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుంది’’ అని చంద్రబాబు అన్నారు.