Select Location
All Locations
State
Region
City / District
ఉప్పల్‎లో అభి ‘వంద’నం.. ఢిల్లీపై హైదరాబాద్ ఘన విజయం

ఉప్పల్‎లో అభి ‘వంద’నం.. ఢిల్లీపై హైదరాబాద్ ఘన విజయం

భాగ్యనగర గడ్డపై సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్ డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (68 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 నాటౌట్‌‌) మళ్లీ అదరగొట్టాడు. మొన్న మెరుపు ఫిఫ్టీతో మెప్పించిన అభి.. ఈసారి టాప్ క్లాస్‌‌ ఆటతో ఢిల్లీ బౌలింగ్‌‌ను షేక్‌‌ చేశాడు. క్లాసిక్ షాట్లతో ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌‌ను ఖుషీ చేస్తూ ఐపీఎల్‌‌లో తన రెండో సెంచరీ కొట్టాడు. అతని జోరుతో భారీ స్కోరు చేసిన సన్‌‌రైజర్స్.. బౌలింగ్‌‌లో ఈషాన్ మలింగ (4/32) దుమ్మురేపడంతో ఐపీఎల్‌‌లో వందో మ్యాచ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి సొంతగడ్డపై మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టింది.

సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్ డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (68 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 నాటౌట్‌‌) మళ్లీ అదరగొట్టాడు. మొన్న మెరుపు ఫిఫ్టీతో మెప్పించిన అభి.. ఈసారి టాప్ క్లాస్‌‌ ఆటతో ఢిల్లీ బౌలింగ్‌‌ను షేక్‌‌ చేశాడు. దీంతో మంగళవారం హైదరాబాద్​ వేదికగా జరిగిన పోరులో సన్​రైజర్స్​ టీమ్ 47 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను చిత్తుగా ఓడించింది. ఫస్ట్​ బ్యాటింగ్‌‌ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 242/2 స్కోరు చేయగా.. డీసీ 20 ఓవర్లలో195/9 స్కోరు చేసి ఓడిపోయింది.

హైదరాబాద్‌‌, వెలుగు: ఖతర్నాక్ బ్యాటింగ్‌‌, పర్‌‌‌‌ఫెక్ట్ బౌలింగ్‌‌తో మెప్పించిన సన్‌‌రైజర్స్ హైదరాబాద్‌‌ ఐపీఎల్‌‌–19లో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన పోరులో 47 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను చిత్తుగా ఓడించింది. ఉప్పల్‌‌లో వరుసగా మూడో విజయం, ఓవరాల్‌‌గా నాలుగో విజయం అందుకొని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన హైదరాబాద్ 20 ఓవర్లలో 242/2 స్కోరు చేసింది.


V6 News 2 days ago
Home Flash News