Select Location
All Locations
State
Region
City / District
హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా శిఖాగోయెల్‌

హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా శిఖాగోయెల్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శిఖాగోయెల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మరో ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు మే 1నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మల్కాజిగిరి కమిషనరేట్‌ సీపీగా బడుగుల సుమతిని, ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌గా తరుణ్‌జోషిని నియమించారు. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఉన్న శిఖాగోయల్‌ (1994బ్యాచ్‌)ను బదిలీ చేసి, హోమ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. దీంతోపాటు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.


Smacy News 1 hour ago
Home Flash News