Select Location
All Locations
State
Region
City / District
ఏసీబీ వలలో బాపట్ల ఆర్ఐ... రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు..

ఏసీబీ వలలో బాపట్ల ఆర్ఐ... రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు..

ఏపీలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ అధికారులు సోమవారం ( ఏప్రిల్ 27 ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు బాపట్ల ఆర్ఐ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... బాపట్ల నగరపాలక సంస్థలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆర్ఐ షేక్ ఇమామ్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు.


V6 News 2 hours ago
Home Flash News