Select Location
All Locations
State
Region
City / District
గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్‌ ఏపీకి గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు

గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్‌ ఏపీకి గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు

విశాఖ: గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్‌ ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది ఏపీ చరిత్రలో మర్చిపోలేని రోజు అని చంద్రబాబు తెలిపారు. ఏపీలో నేటి నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పారు. ఏపీ టెక్నాలజీకి, భారత్కు ఏఐ డేటా సెంటర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని ఏపీ సీఎం ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని, ఆసియాలో అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో నిర్మించబోతున్నామని ఏపీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, అమెరికాలను కలిపేలా సీ కేబుల్స్ నిర్మాణం, గూగుల్ రావడం తనకెంతో గర్వంగా ఉందని ఏపీ సీఎం చెప్పారు.

2028 నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. మంత్రి లోకేష్ అద్భుతంగా పనిచేస్తున్నారని, అన్ని రంగాల్లో అతి త్వరలో ఏఐ సేవలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రాబోతుందని చెప్పారు. ఏడెనిమిది సంవత్సరాల్లో బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ పూర్తవుతుందని ఆశించారు. విశాఖలో గూగుల్ సెంటర్కు సీఎం చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ తర్లువాడలోని 266 ఎకరాల్లో డేటా సెంటర్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గూగుల్ డేటా సెంటర్ కు ఏపీ ప్రభుత్వం 3 ప్రాంతాల్లో భూకేటాయింపులు చేసింది. తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలో 601 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే.


V6 News 1 hour ago
Home Flash News