Select Location
All Locations
State
Region
City / District
దసరా కానుకగా వందో సినిమా?

దసరా కానుకగా వందో సినిమా?

అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తన సినీ ప్రయాణంలో కీలకమైన మైలురాయిని చేరారు. ఆయన నూరవ చిత్రం ‘కింగ్‌ 100’ (వర్కింగ్‌ టైటిల్‌)ని దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. అసాధారణ స్థాయికి ఎదిగిన ఓ సాధారణ వ్యక్తి జీవన ప్రయాణమే ఈ సినిమా అని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇందులో నాగార్జున పాతికేళ్ల యువకుడిగా, అరవై ఏళ్ల వృద్ధునిగా కనిపించబోతున్నారు. 

ఈ రెండూగాక, మరో గెటప్‌లో కూడా నాగ్‌ కనిపిస్తారని తెలుస్తున్నది. దీనికోసం డీ ఏజింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. దర్శకుడు రా.కార్తీక్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నాటికి పూర్తవుతుందట. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా జరుగుతున్నాయి. ఇదిలావుంటే.. జూన్‌ చివరివారంలో కల్యాణ్‌కృష్ణ సినిమా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇస్తారు నాగ్‌. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా రాబోతున్న దసరా, సంక్రాంతి పండుగలను టార్గెట్‌ చేశారు నాగార్జున.


Smacy News 1 hour ago
Home Flash News