టెట్‌కు 1.36 లక్షల దరఖాస్తులు
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతూనే ఉన్నారు. ఈసారి 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన్నారు. దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా, ఈసారి మొత్తం 1,36,418 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో 2.37 లక్షల దరఖాస్తులు రాగా, ఈ సారి 1.36 లక్షలే వచ్చాయి. దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు ఇచ్చిన గడువు ఈ నెల 3న ముగియనున్నట్టు టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ వేయకుండా కేవలం టెట్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల్లో టెట్‌పై ఆసక్తి తగ్గుతున్నది. తెలంగాణవార్తలు రేపు నీట్ ఎగ్జామ్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(యూజీ) ఎగ్జామ్ ఆదివారం జరుగనున్నది.
జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు రాష్ట్రం నుంచి 70 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 140కి పైగా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈసారి సెంటర్లను విద్యార్థుల నివాసాలకు 5-10 కిలోమీటర్ల దూరంలోనే కేటాయించారు. దీంతో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు తప్పనున్నాయి.