నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు.. మంచిర్యాల కలెక్టర్ హెచ్చరిక
నస్పూర్, వెలుగు: నకిలీ, నిషేధిత విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలుపు మందులు, నకిలీ, నిషేధిత విత్తనాల నియంత్రణపై శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం పోలీస్‌కమిషనర్ అంబర్ కిశోర్ ఝాతో కలిసి వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నకిలీ, నిషేధిత విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని నాణ్యమైన విత్తనాల వినియోగం వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.