Select Location
All Locations
State
Region
City / District
నాగబాబు లీడ్ రోల్ లో మేము కాప్‌‌‌‌‌‌‌‌ లం వెబ్ సిరీస్..

నాగబాబు లీడ్ రోల్ లో మేము కాప్‌‌‌‌‌‌‌‌ లం వెబ్ సిరీస్..

నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ రూపొందుతోంది. గెటప్ శ్రీను, రవితేజ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘విక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌వి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకుడు. శనివారం టైటిల్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు. ‘మేము కాప్‌‌‌‌‌‌‌‌లం’ అనే వెరైటీ టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోడి పుంజును ఎత్తుకుని నాగబాబు, పోలీస్‌‌‌‌‌‌‌‌ గెటప్స్‌‌‌‌‌‌‌‌లో గెటప్ శ్రీను, రవితేజ కనిపించారు.

గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఓ ఘటనతో గందరగోళం ఏర్పడుతుంది. ఆ కేసు విచారణ కోసం ఇద్దరు పోలీసులు వస్తారు. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ మెయిన్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌. రూరల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాల నేపథ్యంలో కామెడీ, మిస్టరీ కలయికగా దీన్ని తెరకెక్కించినట్టు మేకర్స్‌‌‌‌‌‌‌‌ తెలియజేశారు. శోభన్ చిట్టుప్రోలు దీనికి కథను అందించారు. బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మిస్తున్నారు.


V6 News 2 hours ago
Home Flash News