ఉప్పల్ మ్యాచ్ తో SRH డబుల్ హ్యాట్రిక్ ఖాయమేనా...?
హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా ఇవాళ ( మే 3 ) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 3: 30 గంటలకు ప్రారంభం కానుంది మ్యాచ్. వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్... ఈ మ్యాచ్ లో విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది.
ఈ సీజన్ లో 9 మ్యాచులాడి 6 మ్యాచులు గెలిచి పాయింట్స్ టేబుల్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది సన్ రైజర్స్. ఈ సీజన్ లో ఇప్పటికే కేకేఆర్ పై ఒకసారి విజయం సాధించింది సన్ రైజర్స్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీష్, సలీల్ అరోరా లాంటి హార్డ్ హిట్టర్స్ తో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్. ప్యాట్ కమ్మిన్స్ ఎంట్రీతో పాటు యువ బౌలర్లు కూడా రాణిస్తుండటంతో సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ పుంజుకుంది.
ఇక ఈ సీజన్ లో 8 మ్యాచులాడి కేవలం రెండు మ్యాచులు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 8వ ప్లేస్ లో ఉంది కేకేఆర్. టాప్ ఆర్డర్ వరుసగా ఫెయిల్ అవుతుండటంతో భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతోంది కేకేఆర్. రింకు సింగ్ మినహా మిడిల్ ఆర్డర్ కూడా ఆకట్టుకోలేకపోతుండటంతో ఇబ్బందులు పడుతోంది కేకేఆర్. ఈ సీజన్ లో బెంచ్ కే పరిమితమైన రచిన్ రవీంద్రను ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశం ఉంది.