West Bengal: మే 9వ తేదీన బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్(West Bengal) కొత్త సీఎం మే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 206 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. అయితే శనివారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇవాళ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ తెలిపింది. బీజేపీ బెంగాల్ చీఫ్ సామిక్ భట్టాచార్య ఈ విషయాన్ని తెలిపారు. అయితే సీఎం రేసులో సువేందు అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. భబానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై ఆయన విజయం సాధించారు. ఇక ఆ రాష్ట్ర మాజీ బీజేపీ చీఫ్ దిలీప్ జోషి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని మోదీ మహిళలకు పెద్ద పీట వేశారు కాబట్టి.. మహిళను సీఎంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం రేసులో మాత్రం సువేందు అగ్రస్థానంలో ఉన్నారు. సీఎం అభ్యర్థి మమతా బెనర్జీని రెండుసార్లు ఆయన ఓడించారు. 2021లో నందిగ్రామ్‌లో, ఈసారి భబానీపూర్‌లో మమతా బెనర్జీపై సువేందు గెలుపొందిన విషయం తెలిసిందే.