ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి: తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ డిమాండ్ చేసింది. మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్, గీత సోనీ, పెంటయ్య గౌడ్ తదితరులు మాట్లాడుతూ.. ప్రైవేటు రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, సొంత ఇల్లు లేని డ్రైవర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నడుస్తున్న ఓలా, ఉబర్, రాపిడో బైక్ ట్యాక్సీలను నిషేధించాలన్నారు. రైల్వే స్టేషన్లలో ఆటోలకు యూనియన్ ద్వారా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు.