ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం సిటీలోని దంసలాపురం రెవెన్యూ పరిధిలో కేటాయించిన 20 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే భూమి కేటాయింపునకు ఆమోదం తెలపగా, తాజాగా టీటీడీ బోర్డు అనుమతి ఇచ్చింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో పర్మిషన్స్రాగా, జిల్లా 'చిన్న తిరుమల'గా రూపుదిద్దుకోనున్నదని జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.