Select Location
All Locations
State
Region
City / District
బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలు నమ్మొద్దు..మంత్రి వివేక్ పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు : దుర్గం వెంకట స్వామి

బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలు నమ్మొద్దు..మంత్రి వివేక్ పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు : దుర్గం వెంకట స్వామి

కోటపల్లి, వెలుగు: బీఆర్ఎస్ నేతలు వరి కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనే స్థితిలో లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దుర్గం వెంకటస్వామి మండిపడ్డారు. శుక్రవారం ఓ ప్రెస్​నోట్​విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందన్నారు.

రైతులు పండించిన ప్రతి గింజ కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొందరు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు వారిని నమ్మరని అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సర్కారు సిద్ధంగా ఉందని, ఎవరూ భయబ్రాంతులకు గురికావొద్దని కోరారు.


V6 News 1 hour ago
Home Flash News