Select Location
All Locations
State
Region
City / District
జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!

జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!

నేటి ఉద్యోగ ప్రపంచంలో 'జెన్ జీ' (Gen Z) తరం గురించి ఒక చర్చ జరుగుతోంది. కొంతమంది వ్యాపారవేత్తలు, యువత పనిపట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారని, ఆఫీస్ రూల్స్ కూడా పాటించరని చెబుతున్నారు. దీనిపై యువ పారిశ్రామికవేత్త రోహిత్ ఆర్యన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో తన అనుభవాన్ని పంచుకుంటూ.. జెన్ జీ ఉద్యోగులు నిజానికి ఎంతో కష్టపడే వారు అని స్పష్టం చేశారు.

''రెండు నెలల క్రితం ఒక జెన్ జీ యువతిని ఉద్యోగంలోకి తీసుకున్నాను. మొదట్లో నేను కూడా.. అందరూ చెప్పినట్లే ఈ తరం గురించి కొన్ని సందేహాలు పెట్టుకున్నాను. కానీ ఆమె పనితీరును దగ్గరగా గమనించిన తరువాత, తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. ఆమె నిజాయితీగా పనిచేయడం, బాధ్యతగా వ్యవహరించడం, తన పనిపట్ల ఆసక్తి చూపించడం ఆయనను ఆకట్టుకున్నాయని వెల్లడించారు.

జెన్ జీ ఉద్యోగులు పని చేయరని మాట తప్పు.. ఎందుకంటే వారు పని చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పాత తరాల ఉద్యోగులు సంప్రదాయ పద్ధతుల్లో పనిచేయడాన్ని ఇష్టపడితే.. జెన్ జీ యువత కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. వారు పని - వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత ముఖ్యమని భావిస్తారు. ఇది వాళ్ల బలహీనత కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన కొత్త దృక్పథం అని రోహిత్ ఆర్యన్ పేర్కొన్నారు.


Sakshi 1 hour ago
Home Flash News