Select Location
All Locations
State
Region
City / District
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ రద్దు

YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ రద్దు

అమరావతి : డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో బెయిల్‌పై ఉండి సాక్షులను బెదిరించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ( YCP MLC Anantha Babu ) బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని సాక్షులను బెదిరించడంతో బాధితులు ఫిర్యాదు మేరకు గత నెల 24న కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆధారాలతో నిరూపణ కావడంతో బెయిల్‌ రద్దు చేసింది. పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్టూర్‌ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. బెయిల్‌ రద్దుతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్సీ అనంతబాబు జైలులోనే ఉండనున్నారు. కాగా ఈనెల 20 నుంచి సుబ్రమణ్యం హత్య కేసు రెగ్యులర్‌ విచారణ ప్రారంభించనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.


Smacy News 1 hour ago
Home Flash News