Select Location
All Locations
State
Region
City / District
Suriya Movies OTT: ఓటీటీల్లో సూర్య బ్లాక్ బస్టర్లు... నెట్‌ఫ్లిక్స్ to ప్రైమ్, హాట్‌స్టార్ - ఎందులో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతోందంటే?

Suriya Movies OTT: ఓటీటీల్లో సూర్య బ్లాక్ బస్టర్లు... నెట్‌ఫ్లిక్స్ to ప్రైమ్, హాట్‌స్టార్ - ఎందులో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతోందంటే?

ఓటీటీ వేదికలు ఎక్కువ ఉన్నాయి. మరి, సూర్య నటించిన ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా? ఫుల్ లిస్ట్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ డీటెయిల్స్ తెలుసా? నటుడిగా సూర్యకు గుర్తింపు తీసుకు వచ్చిన... విమర్శకులతో పాటు ప్రేక్షకుల్ని మెప్పించిన సినిమాల్లో 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు ఉంటాయి. ఆ రెండూ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. 'సింగమ్ 3' కూడా ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ లాల్, సూర్య నటించిన 'కప్పాన్' కూడా ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

'విక్రమ్'లో సూర్య అతిథి పాత్ర చేశారు. అయితే 'రోలెక్స్'గా ఆయన నటన ఎంత ఇంపాక్ట్ చూపించిదనేది పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలుసు. ఆ సినిమా జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సూర్య హీరోగా నటించిన సినిమాల విషయానికి వస్తే... '24', 'యముడు', 'గ్యాంగ్', 'సింగం', 'ఘటికుడు', 'సింగం 3', 'మాస్' స్ట్రీమింగ్ అవుతున్నాయి.

సూర్య నటించిన ఎక్కువ సినిమాలు సన్ నెక్ట్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఉదాహరణకు... ఆయన బ్లాక్ బస్టర్ 'గజినీ'. అలాగే... 'ఆరు', 'రక్త చరిత్ర 2', 'ఈటీ' (తెలుగు) సినిమాలు కూడా ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.


ABP Desam 47 minutes ago
Home Flash News