Select Location
All Locations
State
Region
City / District
Jeevan Reddy | పంట విక్రయించుకునేందుకు అన్నదాతల పడిగాపులు.. బీఆర్‌ఎస్‌ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి

Jeevan Reddy | పంట విక్రయించుకునేందుకు అన్నదాతల పడిగాపులు.. బీఆర్‌ఎస్‌ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి

Jeevan Reddy | జగిత్యాల, మే 15 : ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించు కోవడానికి రైతులు పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించుకునేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నారనీ, గత ఏడాది కన్నా మెరుగైన రీతిలో కొనుగోలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గతేడాది రెండున్నర లక్షల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది లక్షా 20వేలు కొనుగోలు చేశారని, ధాన్యం రవాణా చేసేందుకు లారీలు ఎందుకు తగ్గిపోయినాయనీ, అధికారులకు అవగాహన ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

అలాగే క్వింటాల్ కు అదనపు తూకంతో రైతులు నష్టపోతున్నారని, ధాన్యం రవాణా చేసేందుకు లారీలు కనుమరుగై, ట్రాక్టర్లు కనపడుతున్నాయని పేర్కొన్నారు. తూకం వేసేందుకు గన్ని బ్యాగులు లేవని, ఎవరి ధాన్యం వారే తరలించుకోవాల్సిన దుస్థితి నెలకొందని, జగిత్యాల మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని తాము సందర్శించిన తర్వాత మంత్రి లక్ష్మణ్‌ కుమార్, ఎమ్మెల్యే సైతం సందర్శించారనీ, కానీ సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లో మున్సిపల్ నిర్మించిన మూడు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడే నిల్వ చేసుకోవచ్చన్నారు. ఇక్కడి సమస్యలపై అనుభవంతో కలెక్టర్ కు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కలెక్టర్ కి పరిస్థితులపై అవగాహన లేకపోతే సలహాలు స్వీకరించాలని సూచించారు.

అలాగే మార్కెట్లో వేజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ సిమెంట్, స్టీల్ నిల్వ చేశారని, ఆరు నెలలు గడుస్తున్నా అధికారుల నుండి స్పందన లేదన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ సామాగ్రి నిల్వ చేసేందుకు రైతు ను ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. ధాన్యం తూకంలో జాప్యం, రవాణా, అన్లోడింగ్ ఆలస్యనికి పాలన అధికార యంత్రాంగమే బాధ్యులన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఎంత మంది అధికారులపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కొనుగోళ్లలో జాప్యంతో కల్లాల్లో పడిగాపులు కాయాలా అని ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయం కేంద్రం కేటాయించిందని, స్థలం కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, రైతుల సమస్య కాంగ్రెస్, బీజేపీకి పట్టింపు లేదని పేర్కొన్నారు. స్థలం కేటాయింపు కోసం మంత్రులకు ఉత్తరాలు రాశానని ఎమ్మెల్యే అంటే అవి ప్రేమ సందేశాల లేఖల అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే 24 గంటలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కనబడే ఎమ్మెల్యే సీఎం రేవంత్‌ రెడ్డిని స్థలం కోసం ఒప్పించలేరా అని అని ప్రశ్నించారు. ప్రజా అవసరాల కోసం స్థలాన్ని వినియోగించే అధికారం సీఎంకు ఉందని, సీఎం రేవంత్ రెడ్డి విచక్షణ అధికారంతో రాజేంద్ర నగర్లోని వ్యవసాయ కళాశాల స్థలాన్నీ జ్యుడిషియల్ కు 100 ఎకరాలు కేటాయించారని గుర్తు చేశారు. స్థలం కేటాయించాలని తాను మంత్రికి లేఖ రాశానని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. స్థల ఎంపిక కాకపోవడంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ప్రారంభించలేకపోయారని పేర్కొన్నారు. మంత్రిగా లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన మొదటి సంతకం జగన్నాథ పూర్ బోర్నపల్లి వంతెన కోసం రూ.18కోట్లు కేటాయించారని, బోర్నపల్లి వంతెన కోసం ఎమ్మెల్యే కేంద్ర మంత్రికి ఉత్తరం రాస్తే టెండర్లు అయ్యాయని, ఈ విషయంపై ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐదు ఎకరాలు కేంద్రీయ విద్యాలయం, 25 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 25 ఎకరాలు, స్పోర్ట్స్ కోసం 10ఎకరాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.


Smacy News 52 minutes ago
Home Flash News