Select Location
All Locations
State
Region
City / District
‘శ్రీవాణి టికెట్ల జారీలో అడ్డంగా దొరికిన టీటీడీ’

‘శ్రీవాణి టికెట్ల జారీలో అడ్డంగా దొరికిన టీటీడీ’

సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవాణి టికెట్ల జారీలో టీటీడీ అడ్డంగా దొరికిపోయిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో దోపిడి కొనసాగుతోందని ఆరోపించారు. సెక్యూరిటీ అడిట్ లేని పాత సాఫ్ట్‌వేర్‌నే టీటీడీ కొనసాగిస్తోందని మండిపడ్డారు. టీటీడీ పెద్దలు బరితెగించి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 టీటీడీ పెద్దలు బరితెగించి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Advertisement టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను స్వయంగా శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే లభించలేదు. ఉదయం 9 గంటలు ఒక నిమిషానికే 800 టికెట్ల జారీ పూర్తి అయినట్లు చూపిస్తోంది. ఉదయం 8.50 నుంచి టికెట్ల కోసం సిద్ధంగా ఉంటే 9.01 నిమిషాలకే టికెట్ల అమ్మకాలు పూర్తి అయినట్లు ఆన్‌లైన్‌లో చూపించింది. ఆటో ఫిల్లింగ్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై ఏమాత్రం లెక్కలేని తనంతో టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నారు. ఎస్‌ఈడీ టికెట్ల జారీకి ఆటో ఫిల్లింగ్ విధానం లేదు. చంద్రబాబు అనుమతితో ఈ దోపిడి జరుగుతోందని అనుకోవాలి. టీటీడీ పెద్దలు బరితెగించారు, దోపిడి చేస్తున్నారు. 

టీటీడీ దృష్టికి తీసుకు వచ్చిన తర్వాత కూడా సరిదిద్దుకోలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజుకు 40 లక్షలు రూపాయలు అవినీతి శ్రీవాణి టికెట్ల ద్వారా జరుగుతోంది. బ్లాక్‌లో టికెట్లను అమ్మే వారి ద్వారా దర్శనాలు జరుగుతున్నాయి. సామాన్యులకు దర్శనం టికెట్లు లభించడం లేదు. రూ.300 టికెట్లను మూడు వేలకు బ్లాక్‌లో అమ్ముతున్నారు. రోజుకు ఐదువేల బ్రేక్ దర్శనం టికెట్లను ఇస్తున్నారు. వీటిలో రెండు వేల టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కోటి 5 నుంచి 8వేల వరకు అమ్ముతున్నారు. త్వరలో ఆధారాలతో నిరూపిస్తాం. టీటీడీలో శ్రీవాణి టికెట్ల స్కాం ద్వారా 48 కోట్ల అవినీతి జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు నేతృత్వంలో ఈ దోపిడీ జరుగుతోంది. ట్రావెల్ ఏజెంట్లు ద్వారా అమ్ముతున్నారా అనే దానిపై సమగ్ర విచారణ జరపాలి. హైందవ పెద్దలు దీనిపై వెంటనే స్పందించాలి కోరుకుంటున్నా అని కోరారు.


Sakshi 52 minutes ago
Home Flash News