Select Location
All Locations
State
Region
City / District
మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్!

మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్!

మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ (AIOCD), తెలంగాణ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షల మంది కెమిస్ట్‌లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ-ఫార్మసీలు, ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మరియు అలవాటుగా మారే మందుల విక్రయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టిస్తున్న నకిలీ ప్రిస్క్రిప్షన్లు, మరియు కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మున్ముందు నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.


Smacy News 51 minutes ago
Home Flash News