ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. ఒక్కో కుటుంబానికి అదనంగా 27 వేల రూపాయలు !
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్నందుకు గాను ఉపాధి హామీ కింద వేతనం పొందుతారు. రోజువారీ సగటు వేతనం రూ.300 చొప్పున లెక్కిస్తే.. 90 రోజులకు గాను ఒక్కో కుటుంబానికి సుమారు రూ.27,000 వరకు అదనపు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల నిర్మాణ సాయానికి ఇది అదనం కావడం విశేషం. గతంలో ఇందిరమ్మ ఇళ్లకు కూలీ డబ్బులు రావాలంటే రాష్ట్ర స్థాయి నుంచి జాబితాలు రావాల్సి ఉండేది. దానివల్ల లబ్ధిదారులు నెలల తరబడి నిరీక్షించేవారు. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి లిస్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కమిషన లిపారు.. కలెక్టర్లు, ఎంపీడీవోలే నేరుగా లబ్ధిదారులను గుర్తించి, వారికి వెంటనే 90 రోజుల పని సాంక్షన్ చేసే అధికారం ఇచ్చారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.