సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం
ఇంటర్నెట్‌డెస్క్: సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్ న్యాయవాది వి మోహన, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ (ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే), జస్టిస్ షీల్ నాగు (ప్రస్తుత పంజాబ్ హరియాణా హైకోర్టు సీజే), జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్ (ప్రస్తుత మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే), జస్టిస్ అరుణ్ పళ్లి (జమ్మూకశ్మీర్ హైకోర్టు సీజే) ఉన్నారు. ఇటీవలే సీజేఐ నేతృత్వంలోని కొలీజియం వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో వి. మోహన ఒక్కరే సీనియర్ న్యాయవాది.
న్యాయవాది మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అయిదేళ్ల లా డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సీఎస్ వైద్యనాథన్‌ల వద్ద జూనియర్‌గా ఉన్నారు. 1996లో ఏఓఆర్ పరీక్ష పాసైన తర్వాత దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. వివిధ కేసుల్లో సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబల్, కె.కె.వేణుగోపాల్, పి.చిదంబరం, అరున్‌జైట్లీ, అంద్యార్జునలతో కలిసి పనిచేశారు. 2015 ఏప్రిల్ 23న సీనియర్ న్యాయవాది హోదా పొందారు. ఈమె చేరికతో సుప్రీం కోర్టులో మహిళా జడ్జిల సంఖ్య 2కు చేరినట్లయింది.