Select Location
All Locations
State
Region
City / District
అంగన్ వాడీలో పిల్లలకు ఉప్మా, కిచ్ డీ, పాలు

అంగన్ వాడీలో పిల్లలకు ఉప్మా, కిచ్ డీ, పాలు

చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్యకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.. ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజు గుడ్డు, పాలు, బాలామృతం అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ ను కూడా అందించేందుకు సిద్దమయింది. జూన్ నుంచి ఈ స్కీమ్ ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్ వాడీ కేంద్రాలో అమలు చేయనుంది.

బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ స్కీమ్ కింద ఏడాదిలో 300 రోజులపాటు చిన్నారులకు బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ అందించనున్నారు. మెనూలో భాగంగా ప్రతిరోజూ 25 గ్రాముల కిచిడీ మిక్స్ లేదా ఉప్మా మిక్స్‌‌‌‌‌‌‌‌తో చేసిన అల్పాహారాన్ని వడ్డించనున్నారు. పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నెల రోజుల పాటు స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేసి, ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకున్న అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చిన్నారుల్లో పోషకాహారంలోపం సమస్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం అనే సమస్య నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ అండ్ హెల్త్‌‌‌‌‌‌‌‌ సర్వే – 5 ప్రకారం 33 శాతం ఉండగా.. సర్వే 6 ప్రకారం 27 శాతానికి తగ్గింది. అలాగే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం అనేది 22 శాతం నుంచి 17 శాతానికి, తక్కువ బరువు ఉన్న పిల్లల సంఖ్య 32 నుంచి 28 శాతానికి తగ్గింది. సమస్య గతంతో పోలిస్తే ప్రస్తుతం మెరుగైనప్పటికీ... న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌ సమస్యకు పూర్తిస్థాయిలో చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టాలన్న ఉద్దేశంతో చిన్నారులకు బాల్య దశలోనే పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల్లోని పిల్లలకు ఇప్పటికే ప్రతిరోజూ పాలను అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ను కూడా చేర్చడంతో చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు.


V6 News 1 hour ago
Home Flash News