మెదక్ జిల్లా : రూ.3 వేలు ఇస్తేనే ఫొటో కొడ్తా.. ఇందిరమ్మ ఇంటి బిల్లుకు ఫీల్డ్ అసిస్టెంట్ లంచం డిమాండ్
శివ్వంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేయించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ రూ.3 వేల లంచం డిమాండ్ చేశాడంటూ లబ్ధిదారులు ఆరోపించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని కొంతాన్‌పల్లి తండాకు చెందిన బుజ్జికి తొలి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.