ప్రచారానికే పరిమితం అవుతున్న ‘ఒకటో తేదీకే జీతాలు’.. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్ : అధికారంలోకి వస్తే సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొట్టింది. తీరా గెలిచాక ఆ విషయయమే మరిచిపోయింది. సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టి 5 నెలలు గడుస్తున్నా ఇంకా వారికి జీతాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. డిసెంబర్ 22వ తేదీ 2025 నాడు పదవీ బాధ్యతలు స్వీకరించిన 12,762 గ్రామ పంచాయితీల సర్పంచులకు ఒక్కొక్కరికి రూ.32,500 చొప్పున రూ.41.28 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.హైదరాబాద్ వార్తలు
అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కూడా రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఒకటో తేదీనే జీతాలు అని చెప్పి మొత్తానికే జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నామని, వెంటనే తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బాధిత ఉద్యోగులు కోరుతున్నారు.