Select Location
All Locations
State
Region
City / District
పెట్రోల్, ఎలక్ట్రిక్ లేదా ఫ్లెక్స్-ఫ్యూయల్ ? ఏ కారు బెస్ట్? .. రోడ్ ట్రిప్స్‌కు ఏది సేఫ్ ?

పెట్రోల్, ఎలక్ట్రిక్ లేదా ఫ్లెక్స్-ఫ్యూయల్ ? ఏ కారు బెస్ట్? .. రోడ్ ట్రిప్స్‌కు ఏది సేఫ్ ?

ప్రస్తుతం దేశంలో ధరలు మండిపోతుండటం, ఎలక్ట్రిక్ కార్లు (ఈవీలు) ఎక్కువవుతుండటం, ఫ్లెక్స్-ఫ్యూయల్ పెట్రోల్ ధర.. లాంగ్ జర్నీలకు ఏది బెస్ట్ అనే సందేహం అందరిలోనూ మొదలైంది. మీ ప్రయాణ దూరం, ఖర్చు, సౌకర్యాన్ని బట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు... ఎలా అని ఆలోచిస్తున్నారా...

 పెట్రోల్ కార్లు ఎప్పుడూ నమ్మకమైనవి కొత్త టెక్నాలజీలు ఎన్ని వచ్చినా, లాంగ్ ట్రిప్స్‌కు ఇప్పటికీ పెట్రోల్ కార్లే ఫస్ట్ ఛాయిస్. ఎందుకంటే ఎక్కడైనా పెట్రోల్ బంకులు దొరుకుతాయి. ఐదు నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ చేయొచ్చు. ఇంకా ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 500 నుండి 900 కి.మీ వరకు హాయిగా వెళ్ళొచ్చు. అలాగే దేశంలో ఏ మూలనైనా వీటిని రిపేర్ చేసే మెకానిక్‌లు ఉంటారు. 2. ఎలక్ట్రిక్ కార్లు తక్కువ ఖర్చు - ఎక్కువ ప్లానింగ్ డబ్బు ఆదా చేయాలనుకునే వారికి ఎలక్ట్రిక్ కార్లు మంచి ఆప్షన్. కానీ, కొన్ని జాగ్రత్తలు అవసరం. అయితే కిలోమీటరుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ, ఇంజిన్ గొడవ ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ కూడా తక్కువే. సమస్య ఏంటంటే హైవేలపై ఛార్జింగ్ పాయింట్లు ఇంకా అన్ని చోట్ల లేవు... ఉన్న కూడా ఛార్జింగ్ పెట్టడానికి కనీసం 30-60 నిమిషాలు ఆగాలి. ఈ కార్లు ఎవరికి సెట్ అవుతాయంటే... సిటీల్లో తిరిగే వారికి, ముందుగానే ప్లాన్ చేసుకుంటే వారికి ఇది బెస్ట్. 3. భవిష్యత్తు కోసం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఈ కార్లు పెట్రోల్ - ఇథనాల్ కలిసిన ఇంధనంతో నడిచే కార్లు. ఈ కార్ల వల్ల ప్రయోజనం ఏంటంటే పర్యావరణానికి మంచివి. 

పెట్రోల్ కంటే ఇథనాల్ ధర తక్కువ. ప్రస్తుత పరిస్థితి చూస్తే కొన్ని బ్యాంకుల్లో పెట్రోల్‌లో 20% ఇథనాల్ (E20) కలిపి అమ్ముతున్నారు. కానీ 85% లేదా 100% స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడిచే బంకులు ఇంకా ఊరూరా రాలేదు. ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే వస్తోంది, ఇంకా పూర్తిగా అందుబాటులోకి రావడానికి టైం పడుతుంది. మీరు దేనిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫ్యామిలీతో రోడ్ ట్రిప్స్ చేసేవారైతే ఎక్కడా టెన్షన్ లేకుండా తాగడానికి పెట్రోల్ కారు బెస్ట్. రోజూ ఎక్కువ దూరం తిరిగేవారైతే పెట్రోల్ ఖర్చు భారం తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ (EV) కార్లు బెస్ట్. కొత్తగా ట్రై చేయాలనుకుంటే: ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లను చూడొచ్చు, కానీ ఇథనాల్ పెట్రోల్ ఇంధనం దొరకడంపై ఇంకా క్లారిటీ రావాలి. ALSO READ : E85 పెట్రోల్ ఎందుకు రా బాబు.. మా బండ్లు దొబ్బుతున్నాయ్ సింపుల్ గా చెప్పాలంటే.. 2026లో కూడా సాఫీగా, టెన్షన్ లేకుండా లాంగ్ జర్నీలు చేయాలంటే పెట్రోల్ కార్లే ప్రస్తుతానికి సేఫ్ ఆప్షన్. అయితే, మీరు వెళ్లే రూట్‌లో ఛార్జింగ్ పాయింట్లు ఉంటే ఎలక్ట్రిక్ కార్లను ధైర్యంగా తీసుకోవచ్చు. మీరు ఎక్కువగా హైవేల మీద ప్రయాణిస్తారా లేక సిటీలోనే డ్రైవ్ చేస్తారా ? మీ అవసరాన్ని బట్టి బెస్ట్ కారును సెలెక్ట్ చేసుకోండి!


V6 News 1 hour ago
Home Flash News