Select Location
All Locations
State
Region
City / District
TMC | టీఎంసీకి మరోషాక్‌.. ఎంపీ సుఖేందు శేఖర్‌ రే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా

TMC | టీఎంసీకి మరోషాక్‌.. ఎంపీ సుఖేందు శేఖర్‌ రే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా

హైదరాబాద్‌ : అంతర్గత సంక్షోభంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో నాటకీయ మలుపులు తిరుగుతున్నాయి. మమతపై పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసిన విషయం మరవకముందే ఆ పార్టీలో మరో సంక్షోభం నెలకొంది. టీఎంసీపై అసంతృప్తితో ఉన్న ఎంపీ సుఖేందు శేఖర్‌ రే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం అవుతున్న తరుణంలోనే రాజీనామాకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.

సుఖేందు శేఖర్‌ గతంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడే తన మనసులోని మాటను బయట పెట్టారు. అసెంబ్లీ నుంచి తిరుగుబాటు పార్లమెంట్‌కు కూడా పాకొచ్చని ఆయన అన్నారు. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై తిరుగుబాటు వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఎంసీ ఎంపీలలో కూడా అసమ్మతి రాజుకుంటున్న నేపథ్యంలో బెంగాల్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.


Smacy News 1 hour ago
Home Flash News