Select Location
All Locations
State
Region
City / District
ఆధ్యాత్మికం: ఇండియాలో వెయ్యేళ్ల గుడి.. అంతా మిస్టరీ.. అన్నీ వింతలే..!

ఆధ్యాత్మికం: ఇండియాలో వెయ్యేళ్ల గుడి.. అంతా మిస్టరీ.. అన్నీ వింతలే..!

ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయంలో గోడలపై సర్వ దేవతల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దగా కనిపిస్తాయి. వీరితో పాటూ అష్ట దిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. అష్ట దిక్పాలకులు కొలువైన అరుదైన దేవాలయాల్లో బృహదీశ్వరాలయం ఒకటి.

తంజావూరు బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేసారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం. అవును ఈ ఆలయాన్ని నిర్మించి వేయి సంవత్సరాలయింది. బహు పురాతన ఆలయమిది.. అందుకే ప్రపంచ వారసత్వ సంపద వారు దీనిని రక్షిత ప్రదేశంగా పరిగణించారు... ఎక్కడా సిమెంట్ అన్నమాటకు తావు లేకుండా ఉక్కు అన్నపదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఈ దేవాలయం 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన గుడి. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం.దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో దాదాపు ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. పెద్ద నంది విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది.


V6 News 1 hour ago
Home Flash News