Select Location
All Locations
State
Region
City / District
రేపు (జూన్ 11)  గవర్నర్‌‌ తో ఆదివాసీ ప్రతినిధుల భేటీ

రేపు (జూన్ 11) గవర్నర్‌‌ తో ఆదివాసీ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఐదో షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల రాజ్యాంగబద్ధ రక్షణల అమలు వంటి వివిధ సమస్యలపై అఖిల భారత ఆదివాసీ సమన్వయ కమిటీ ప్రతినిధి బృందం జూన్ 11న ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్‌‌తో సమావేశం కానున్నది.

గవర్నర్​ను కలిసే వారిలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, కమిటీ సలహాదారు, మాజీ డీజీపీ డాక్టర్​ జె. పూర్ణచందర్​రావు, గోండులు, కోయలు ఉన్నారు. ఆదివాసీల భూమి, అటవీ హక్కులు, స్వయం పరిపాలన, విద్య, ఉపాధి వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.


V6 News 1 hour ago
Home Flash News