హైదరాబాద్ సక్కగా చేయండి.. ప్యూచర్ సిటీని ఎవరూ నమ్మటం లేదు : కేటీఆర్
హైదరాబాద్ సిటీని సక్కగా చేయకుండా.. ఉన్న హైదరాబాద్ ను బాగు చేయకుండా ప్యూచర్ సిటీ కడతాం అంటే ఎవరూ నమ్మటం లేదన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్. హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాల్సింది ఇంకా చాలా ఉందని.. దాన్ని వదిలేసి కొత్త సిటీ సిటీ కట్టాల్సిన అసవరం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. మీడియా చిట్ చాట్ లో ప్యూచర్ సిటీకి సంబంధించిన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారాయన.
మొన్నటి వర్షానికి హైదరాబాద్ సిటీలో వాహనదారుల అవస్థలు చూశామని.. దీనికి కారణం రేవంత్ రెడ్డి నిర్ణయాలే అని.. సీఎంగా హైదరాబాద్ సిటీపై అవగాహన లేదంటూ విమర్శలు చేశారు కేటీఆర్. ఉన్న సిటీని పట్టించుకోకుండా ప్యూచర్ సిటీపై ఫోకస్ పెట్టి జనాన్ని ఇబ్బందులకు గురి చేయటం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. రెండు చెరువులు బాగు చేసి ఫోజులు కొడుతున్నారని.. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 100 చెరువులు అభివృద్ధి చేసిన విషయం కనిపించటం లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. అన్నింటికీ హైడ్రా అంటూ జిందా తిలిస్మాత్ మాదిరి వాడుతున్నారని.. దీని వల్లే మొన్నటి వర్షాలకు వచ్చిన దుస్థితి అంటూ చురకలు అంటించారు కేటీఆర్.