Select Location
All Locations
State
Region
City / District
FIFA World Cup: హోరాహోరీ మ్యాచ్లో ఘనా గెలిచెన్‌‌..

FIFA World Cup: హోరాహోరీ మ్యాచ్లో ఘనా గెలిచెన్‌‌..

టొరంటో: వరల్డ్‌‌ కప్‌‌లో ఘనా జట్టు శుభారంభం చేసింది. హోరాహోరీగా సాగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌‌లో ఘనా 1–-0 తేడాతో పనామాపై విజయం సాధించింది. మ్యాచ్ ముగిసేందుకు మరో కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో లభించిన అవకాశాన్ని ఘనా అద్భుతంగా ఉపయోగించుకుని విజేతగా నిలిచింది.

మ్యాచ్ ప్రారంభం నుంచీ ఇరుజట్ల రక్షణ శ్రేణులు పటిష్టంగా ఆడటంతో గోల్స్ చేయడానికి రెండు జట్లకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. వర్షం కురుస్తున్న తరుణంలో జరిగిన ఈ మ్యాచ్‌‌లో ప్రథమార్ధంలో పనామాకు లభించిన ఒకే ఒక్క గోల్ అవకాశాన్ని ఘనా ప్రత్యామ్నాయ గోల్‌‌కీపర్ బెంజామిన్ అసారే అద్భుతంగా అడ్డుకున్నాడు. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో, రెండో సగం ఇంజూరీ టైమ్ (95వ నిమిషం)లో ఘనా ఆటగాడు బ్రాండన్ థామస్ అసాంతే ఎడమ వైపు నుంచి బంతిని గోల్ పోస్ట్ వైపు పంపాడు. అక్కడ సిద్ధంగా ఉన్న కాలెబ్ యిరెంకీ ఏమాత్రం పొరపాటు చేయకుండా బంతిని నెట్‌‌లోకి పంపడంతో ఘనా ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయింది.


V6 News 1 hour ago
Home Flash News