Select Location
All Locations
State
Region
City / District
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి పిలుపు

ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి పిలుపు

న్యూఢిల్లీ: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించలేదు. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌‌‌‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వైమానిక దాడుల మొదటి రోజే ఖమేనీ(86) మరణించారు. దాదాపు 36 ఏళ్ల పాటు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌‌‌‌కు సుప్రీం లీడర్‌‌‌‌గా ఆయన సేవలందించారు.

ఖమేనీ అంత్యక్రియలు జులై 4న ప్రారంభమై, జులై 9న ఆయన స్వస్థలం మష్హాద్‌‌‌‌లో ఖననంతో ముగియనున్నాయి. జులై 7న ఖోమ్ నగరంలో కూడా ప్రత్యేక ప్రార్థనలు, స్మారక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఖమేనీ మరణించిన వెంటనే అంత్యక్రియలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగినా, యుద్ధ పరిస్థితుల కారణంగా అప్పట్లో వాయిదా వేశారు.


V6 News 9 hours ago
Home Flash News