Naga Chaitanya | నాగచైతన్య కొత్త సినిమాలపై జోరుగా ప్రచారం.. హారర్ థ్రిల్లర్ టాక్‌కు టీమ్ క్లారిటీ
Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య తదుపరి ప్రాజెక్టులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, ఆయన కొత్త సినిమాల లైనప్ గురించి ఎంటర్‌టైన్‌మెంట్ పేజీలు, సినీ వర్గాలకు చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో వరుస పోస్టులు దర్శనమివ్వడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇద్దరు కొత్త దర్శకులతో చైతన్య సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది
Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య తదుపరి ప్రాజెక్టులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, ఆయన కొత్త సినిమాల లైనప్ గురించి ఎంటర్‌టైన్‌మెంట్ పేజీలు, సినీ వర్గాలకు చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో వరుస పోస్టులు దర్శనమివ్వడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇద్దరు కొత్త దర్శకులతో చైతన్య సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నాగచైతన్య, ఆ తర్వాత పూర్తిస్థాయి హారర్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. మసూద చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయి కిరణ్ చెప్పిన కథను చైతన్య ఇప్పటికే విన్నారని, ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి.
కథ నచ్చడంతో కేవలం తుది నిర్ణయం మాత్రమే మిగిలి ఉందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా బెదురులంక దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలోనూ నాగచైతన్య ఓ కొత్త కాన్సెప్ట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ‘వృషకర్మ’ షూటింగ్ పూర్తయ్యాక ఈ ఏడాది చివర్లో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని పలు కథనాలు పేర్కొన్నాయి. వరుసగా ఇద్దరు కొత్త తరహా దర్శకుల పేర్లు వినిపించడంతో అభిమానులు ఈ ప్రాజెక్టులపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి నాగచైతన్య టీమ్ స్పష్టత ఇచ్చింది. మసూద దర్శకుడు సాయి కిరణ్‌తో సినిమా ఖరారైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ఇప్పటివరకు ఇద్దరి మధ్య స్క్రిప్ట్ చర్చలు గానీ, అధికారిక సమావేశాలు గానీ జరగలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే క్లాక్స్‌తో సినిమా విషయంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కొత్త దర్శకుల నుంచి కథలు వింటున్న మాట నిజమే అయినప్పటికీ, ఏ ప్రాజెక్ట్‌కూ ఇంకా తుది ఆమోదం ఇవ్వలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుంటున్న నాగచైతన్య, ఇప్పుడు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించకూడదనే నిర్ణయంతో ఆయన ముందుకు సాగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం తన పూర్తి దృష్టి ‘వృషకర్మ’ సినిమాపైనే పెట్టిన చైతన్య, ఆ చిత్రం పూర్తయిన తర్వాత మాత్రమే కొత్త కథలను ఫైనల్ చేయనున్నారని సమాచారం. తన ఇమేజ్‌కు సరిపోయే బలమైన కథలు, కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ ఒక్కో అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.