Select Location
All Locations
State
Region
City / District
బొద్దింకల్లాగే ఉన్నరు.. సీజేపీ నిరసనకారులపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్

బొద్దింకల్లాగే ఉన్నరు.. సీజేపీ నిరసనకారులపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదంపై జంతర్ మంతర్​వద్ద నిరసన తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరసనలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్​గా మారిన వీడియోలు ‘వాంతులు తెప్పించేలా’ ఉన్నాయని, ఆందోళనకారులు తమలోని మురికిని, చెత్తను సమాజం ముందు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నిరసనకారుల తీరు, వాడుతున్న భాష అత్యంత అసభ్యంగా ఉందని మండిపడ్డారు. మిమ్మల్ని మీరే బొద్దింకలని పిలుచుకుంటూ, అలాగే ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వీడియోలు చూసి తాను మనోవేదనకు గురయ్యానని, డిజిటల్ డిటాక్స్ కావాలని అన్నారు.


V6 News 1 hour ago
Home Flash News