Select Location
All Locations
State
Region
City / District
తెలంగాణలో రూ.4,883 కోట్లతో రైల్వే పనులు

తెలంగాణలో రూ.4,883 కోట్లతో రైల్వే పనులు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రూ.4,883 కోట్ల అంచనా వ్యయంతో 118 రైల్వే పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో 3 ఆర్‌‌‌‌‌‌‌‌ఓబీలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుతో చేపడుతోందన్నారు. బుధవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో 3 ఆర్‌‌‌‌‌‌‌‌ఓబీలు, 7 ఆర్‌‌‌‌‌‌‌‌యూబీలు, 8 లెవల్ క్రాసింగ్‌‌‌‌‌‌‌‌లు ఉండగా, రూ.197 కోట్లతో 4 పనులు చేపట్టినట్లు తెలిపారు. యెల్గూర్-నెక్కొండ ఆర్‌‌‌‌‌‌‌‌యూబీ పనులు పూర్తయ్యాయని, వరంగల్-చింతలపల్లి ఆర్‌‌‌‌‌‌‌‌ఓబీ టెండర్ ఖరారైందన్నారు. 

తెలంగాణలో 2014-–26 మధ్య 888 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఎంపీ సురేశ్​కుమార్ షెట్కార్ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రూ.40,769 కోట్లతో 21 ప్రాజెక్టులు మంజూరు కాగా, ఇప్పటివరకు 677 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు. మొత్తం 2,792 హెక్టార్ల భూమిలో 1,772 హెక్టార్లు సేకరించగా, ఇంకా 1,020 హెక్టార్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని చెప్పారు. 2026-27 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ రైల్వే పనులకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆధునిక హోల్‌‌‌‌‌‌‌‌సేల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.47.03 కోట్లతో కూలింగ్ సదుపాయాలతో మార్కెట్ నిర్మించనున్నట్లు కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో ముర్రెల్ (కొర్రమీను) క్లస్టర్ ఏర్పాటు చేసి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్​వై) కింద 2020--21 నుంచి తెలంగాణకు రూ.353.01 కోట్ల ప్రపోజల్స్ క్లియర్ కాగా, ఇందులో కేంద్ర వాటా రూ.112.68 కోట్లు ఉందన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు (ఎన్​ఎఫ్​డీబీ) ద్వారా రాష్ట్రంలో 389 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించి, 15,565 మంది మత్స్యకారులకు స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనింగ్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.


V6 News 1 hour ago
Home Flash News