గుంటూరులోని ఎస్వీఎన్ కాలనీలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సమీపంలో కిట్స్ అక్షర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బస్సును నడుపుతున్న డ్రైవర్‌కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయన స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయారు.
దీంతో అదుపుతప్పిన ఆ బస్సు సమీపంలోనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్టింది. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, స్థానికులు వెంటనే స్పందించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. బస్సులో ఉన్న విద్యార్థులందరినీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సురక్షితంగా కిందకు దించడంతో పెను ముప్పు తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన డ్రైవర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
LIVE