... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ వాసులకు సిటీ పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. దీంతో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని - సిటీ పోలీసులు తెలిపారు.

ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లే వాహనదారులు ప్రత్యానయ మార్గాలు ద్వారా వెళ్ళాలని ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు.

ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు:

NFCL నుంచి వచ్చే ట్రాఫిక్: శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ధ), కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ -36- 45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వారు.. శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోవాలి. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ -5, వెంకటగిరి ఎక్స్‌రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36- 45 నుంచి వచ్చే ట్రాఫిక్: NFCL వైపు వెళ్లే వారు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నెంబర్-2, యూసుఫ్ గూడ బస్తీ, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లవచ్చు.

KCP - బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -1 నుంచి వచ్చే వారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.

మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చే వారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. విరించి హాస్పిటల్ (1/12) వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.

Source : Smacy News

1 hour ago

Home Flash News