... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
టీమ్‌ఇండియా అద్భుతం చేసింది: మాజీ క్రికెటర్లు

టీమ్‌ఇండియా అద్భుతం చేసింది: మాజీ క్రికెటర్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత జట్టు టీ20 ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) 2026 సెమీస్‌కు దూసుకెళ్లింది. టాస్‌ గెలిచిన టీమ్ఇండియా (Team India) తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. భారత్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 199 రన్స్ చేసి, విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంజుశాంసన్‌ (Sanju Samson) 97* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. టీమ్ఇండియా సాధించిన ఈ విజయంపై పలువురు మాజీలు సోషల్‌ మీడియా వేదికగా తమ అభినందనలు తెలిపారు.

మన క్రికెటర్లు అద్భుతం చేశారు. సెమీఫైనల్‌లోకి భారత్‌ ప్రవేశించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ చివరి ఓవర్లలో మనం బాగా ఆడాం. క్రీజులో పాతుకుపోయి సంజుశాంసన్‌ ఆడుతుంటే చూడటానికి బాగుంది. అతడు మ్యాచ్‌ను మన వైపు తిప్పాడు. అందరూ బాగా ఆడారు. - సచిన్‌ తెందూల్కర్‌

ఈ విజయం టీమ్ఇండియాలో ఆత్మవిశ్వాసం నింపింది. 196 పరుగులను విజయవంతంగా ఛేదించి భారత్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ముఖ్యంగా సంజుశాంసన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. - అనిల్‌ కుంబ్లే

ఒత్తిడిని చక్కగా తట్టుకొని, మ్యాచ్‌లో గెలిచి, సెమీస్‌లో స్థానం దక్కించుకున్న టీమ్ఇండియాకు శుభాకాంక్షలు. సంజుశాంసన్‌ భయంకర ఇన్నింగ్స్‌ ఆడాడు. మిషన్‌ కంటిన్యూస్‌. - వీవీఎస్‌ లక్ష్మణ్‌

Source : Smacy News

1 day ago

Home Flash News