... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
దుబాయ్‌లో అజిత్‌, మాధవన్‌.. క్షేమంగానే ఉన్నారన్న సిబ్బంది

దుబాయ్‌లో అజిత్‌, మాధవన్‌.. క్షేమంగానే ఉన్నారన్న సిబ్బంది

ఇంటర్నెట్‌ డెస్క్: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం వేళ.. పలు దేశాల్లో దాడులు జరుగుతోన్న విషయం తెలిసిందే. కువైట్, ఖతార్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు (Iranian missile strikes) చేస్తోంది. ఈ సమయంలో అక్కడే ఉన్న అజిత్‌, మాధవన్‌ల గురించి వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అజిత్‌ టీమ్‌ ఈ వార్తలపై స్పందించింది. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపింది.

మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్స్‌ కోసం ఈ మధ్యకాలంలో అజిత్‌ ఎక్కువ సమయం దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఇటీవల ఆయన తిరిగి చెన్నై రావాల్సిఉండగా దుబాయ్‌ గగనతలంపై ఆంక్షలు విధించడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అజిత్ క్షేమంగా ఉన్నారని.. ఆయన ప్రణాళికల్లో మార్పులు చేసుకున్నారని మేనేజర్‌ చెప్పారు. అభిమానులు భయపడొద్దని అన్నారు. ఇక మాధవన్ కూడా తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం తాను దుబాయ్‌లో లేనని కుటుంబంతో సహా అమెరికాలో ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు.

మరోవైపు దుబాయ్‌ గగనతలంలో ఇరాన్‌ క్షిపణుల దాడి దృశ్యాలను నటుడు మంచు విష్ణు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అవి తాముంటున్న ఇంటిని కదిలించాయని చెప్పారు. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు తమను ఎంతో భయాందోళనకు గురి చేసిందని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అన్నారు.

Source : Smacy News

1 hour ago

Home Flash News