వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు:- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున భక్తులు స్వామి కల్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ధర్మగుండంలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో స్వామికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు.