... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
హోలీ పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్

హోలీ పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, కొత్త ఆశలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, కొత్త ఆశలు నిండాలని ఆకాంక్షించారు. ప్రేమాభిమానాలను విరజిమ్మే రంగుల పండుగగా భారతీయ సంప్రదాయంలో హోలీ ప్రత్యేకతను సంతరించుకున్నదని అన్నారు. ఇది సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆకాంక్షించారు.

శిశిర ఋతువు ముగిసి వసంతం ఆరంభమయ్యే ఈ సమయంలో హోలీ ప్రకృతిలో నూతనత్వానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో కొత్త ఆశలు, విశ్వాసాలు పునరుజ్జీవించాలని, సమాజంలో మరింత ఐక్యత, సహోదరతత్వం పెరగాలని ఈ పండుగ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో హోలీని జరుపుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు.

Source : Smacy News

2 hours ago

Home Flash News