గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండే ఒకేఒక ఆలయం.. విశేషాలివే..
సాధారణంగా గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణ ప్రభావం దేవుళ్లపై పడుతుందనే కారణంగా ఆలయాలను మూసివేసి.. గ్రహణం ముగిసిన తరువాత అర్చకులు ఆలయాన్ని తెరచి శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు చేపడతారు. కానీ, గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంచే ప్రసిద్ధ ఆలయం మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఒకటుంది. ఆ ఆలయమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
సాధారణంగా గ్రహణం రోజున దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నిశ్శబ్దం ఆవహిస్తుంది. ఆలయాలన్నింటినీ మూసివేస్తారు. మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టెంపుల్స్‌ని గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణానికి కనీసం 6 గంటల ముందు గర్భగుడిని మూసివేసి.. గ్రహణం తరువాత సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరుస్తారు. ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది.