Stock Market Crash Today: దలాల్ స్ట్రీట్ చరిత్రలో భారీ పతనం: 1700 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. 92.17 వద్ద రూపాయి రికార్డు లో!
Stock Market Crash Today: దేశీయ మార్కెట్ లపై పశ్చిమాసియా యుద్ధప్రభావం తీవ్రంగా పడింది. గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇవాళ ట్రేడింగ్ లో దలాల్ స్ట్రీట్ చరిత్రలో నిలిచిపోయే భారీ పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 1700, నిఫ్టీ 500 పాయింట్లు పతనం అయ్యాయి. . ఒక్క రోజు స్టాక్ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
మరో వైపు రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమయ్యింది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఒక్క రోజే 67 పైసులు క్షీణించి 92.17 వద్ద ఆల్ టైం లోకి చేరుకుంది. ఈ భారీ పతనానికి ప్రధానంగా ఇరాన్ అగ్రనేత ఖమేనీ మరణం తర్వాత పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు సెగ తోడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకోవడంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. యుద్ధం గనుక మరికొన్ని రోజులు కొనసాగితే మార్కెట్లు మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని.. ఇన్వెస్టర్లు ఆచితుడి అడుగు వేయాలని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.