Virosh reception: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన ప్రముఖులు..
హైదరాబాద్ బంజారాహిల్స్ తాజ్ క్రిష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతుల రిసెప్షన్ ఘనంగా జరుగుతోంది. విజయ్ దేవర కొండ వైట్ పంచె,భుజంపై కండువతో అదిరిపోయే లుక్ లో కనిపించారు. ఇక రష్మిక రెడ్ శారీలో మెరిశారు. ఫస్ట్ ఇరు ఫ్యామిలీలతో కలిసి నూతన దంపతులు ఫోటోలు దిగారు. ఈ రిసెప్షన్ కి సినీ,రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
తెలంగాణ గవర్ణర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, కేటీఆర్ దంపతులు, హైదరాబాద్ సీపీ సజ్జనార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, కేవీపీ రామచందర్ రావు, డైరెక్టర్ సుకుమార్, బుచ్చిబాబు, బాబి, నాగార్జున, నాగచైతన్య, వెంకటేశ్,రవితేజ,శ్రీకాంత్ దంపతులు, నిర్మాత దిల్ రాజు దంపతులు,మహేశ్ బాబు సతీమణి నమ్రతా, హీరో కార్తీ, నవీన్ పొలిశెట్టి, నిర్మాత నవీన్ ఎర్నేణి, నటి కృతిశెట్టి, సింగర్ చిన్మయి, నాగవంశీ, సందీప్ కిషన్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.