ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికి సెనెట్ మద్దతు
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేపట్టిన ఈ సైనిక చర్యకు ఆ దేశ సెనెట్‌లో మద్దతు లభించింది.
ఇరాన్ (Iran)పై చేపట్టిన సైనిక చర్యను కొనసాగించడానికి ట్రంప్ అధికారాలను పరిమితం చేసే తీర్మానాన్ని సెనెట్‌లో ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్ సభ్యుడు టిమ్ కైన్ తీసుకొచ్చిన ఈ తీర్మానానికి ఆమోదం లభించలేదు. ట్రంప్ సైనిక చర్యకు మద్దతుగా 53 మంది ఓటు వేయగా.. 47 మంది మాత్రమే వ్యతిరేకించారు. తీర్మానం వీగిపోవడంతో.. అధ్యక్షుడి నిర్ణయానికి మద్దతు లభించినట్లయ్యింది. ఈ తీర్మానానికి రిపబ్లికన్ సభ్యుడు రాండ్ పాల్ అనుకూలంగా.. డెమోక్రటిక్ సభ్యుడు జాన్ ఫెట్టర్‌మాన్ వ్యతిరేకంగా ఓటు వేశారు.