... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
దుబాయ్‌లో ఉన్నవారికి మేం సాయం చేస్తాం: సోనూసూద్‌

దుబాయ్‌లో ఉన్నవారికి మేం సాయం చేస్తాం: సోనూసూద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల (విమాన సర్వీసుల రద్దు) కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ఆయన సాయం చేయనున్నట్లు తెలిపారు. అక్కడ ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా వసతి కల్పించనున్నట్లు చెప్పారు.

ఎలాంటి షరతులు లేవని.. ఏ దేశస్థులైనా ఉచితంగా బస చేయవచ్చని చెప్పారు. ఇలాంటి సమయంలో మానవత్వం మాత్రమే ముఖ్యమని సోనూసూద్‌ అన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ చేస్తే తన టీమ్‌ వారిని సంప్రదిస్తుందన్నారు. కరోనా సమయంలో లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చిన సోనూసూద్, తాజా పరిణామాలతో విదేశాల్లో చిక్కుకున్న వారికి కూడా అండగా నిలవడంపై నెట్టింట ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Source : Smacy News

1 hour ago

Home Flash News