... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
బంజారాహిల్స్ లో డాల్డా, పామ్ ఆయిల్‌తో కల్తీ నెయ్యి తయారీ..హోటళ్లు, శుభకార్యాలకు ఇక్కడి నుంచే సప్లై

బంజారాహిల్స్ లో డాల్డా, పామ్ ఆయిల్‌తో కల్తీ నెయ్యి తయారీ..హోటళ్లు, శుభకార్యాలకు ఇక్కడి నుంచే సప్లై

బంజారాహిల్స్ కల్తీ నెయ్యి తయారీ.. హోటళ్లు, శుభకార్యాలకు ఇక్కడి నుంచే సప్లై

హైదరాబాద్ లో బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ , మాసబ్ ట్యాంక్ పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 బోలానగర్ లో ఉన్న ప్రైడ్ డెయిరీ యూనిట్ ను సీజ్ చేసిన అధికారులు .. యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ ను అరెస్ట్ చేశారు.

నెయ్యి కల్తీ కోసం ఉపయోగిస్తున్న 28 డబ్బాల రుచి గోల్డ్ డాల్డా, ఇతర కాళీ డబ్బాలు , ఆయిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తయారీకి వినియోగిస్తున్న రెండు బాయిలర్లు, ఒక పుషింగ్ మిషన్,ఒక ప్యాకింగ్ మిషన్, రెండు వేయింగ్ మిషన్లు, నెయ్యి నిలువ ఉంచిన 70 రకాల చిన్న పెద్ద బేసిన్లు ,ప్యాకింగ్ కవర్లు సీజ్ చేశారు. రూ. 18.26 లక్షల విలువైన కల్తీ సరుకు.. 460 కేజీల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు.

డాల్డా, పామ్ ఆయిల్‌తో నెయ్యి కల్తీ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. 2,090 కేజీల ఆవు మీగడ, 1,170 కేజీల గేదె మీగడను పట్టుకున్నారు. హోటళ్లు, శుభకార్యాలకు అసలైన నెయ్యిగా విక్రయిస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడిన నిందితుడు మహమ్మద్ జునైద్ హుస్సేన్ పై BNS సెక్షన్లు 318(4), 274, 275 కింద కేసు నమోదు చేశారు.

Source : V6 News

2 hours ago

Home Flash News