... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఇరాన్‌పై విచ్చుకున్న ఉక్కు రెక్కలు.. రంగంలోకి స్ట్రాటోఫోర్ట్రెస్‌..!

ఇరాన్‌పై విచ్చుకున్న ఉక్కు రెక్కలు.. రంగంలోకి స్ట్రాటోఫోర్ట్రెస్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అదొక భారీ ఉక్కు డేగ.. ఒక్కసారి గాల్లోకి ఎగిరితే శత్రువుపై 38 టన్నుల బాంబుల వర్షం కురిపించడం ఖాయం. గగనతలం నుంచే సముద్రంలోని లక్షల చదరపు మైళ్లను నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. ఒక్క యుద్ధంలో 40% బాంబులను ప్రయోగించిన చరిత్ర దీనిది. ఒకరకంగా చెప్పాలంటే యుద్ధ విమానాల్లో అనకొండ లాంటిది. అదే అమెరికాకు చెందిన బి-52 స్ట్రాటో ఫోర్ట్రెస్‌ (B-52H Stratofortress) బాంబర్‌..! అమెరికా వాయుసేనకు ఇది వెన్నెముక లాంటిది. బి-2 స్పిరిట్‌లా దీనికి పెద్దగా ప్రచారం లేకపోయినా.. ఇది సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతుంది.

అమెరికా వాయుసేన అమ్ములపొదిలో చాలా పాత బాంబర్‌ విమానాల్లో బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ (B-52H Stratofortress) ముఖ్యమైంది. ఇది 1955లో ఆ దేశ వాయుసేన చేతికి వచ్చింది. మొత్తం 744 విమానాలను తయారుచేయగా.. చివరి బి-52హెచ్‌ వేరియంట్‌ను 1962లో తయారుచేశారంటే అవెంత పాతవో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్కటే 20 క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించగలదు. దీనిని అవసరాలకు అనుగుణంగా అమెరికా యుద్ధాల్లో వాడుకొంటోంది. కోల్డ్‌వార్‌ వేళ అణ్వాయుధాలను ప్రయోగించగల బాంబర్‌గా ఇది భయపెట్టగా.. వియత్నాం యుద్ధంలో చిన్నస్థాయి బాంబర్‌లాగా సేవలు అందించింది. తాజాగా ఇరాన్‌ (Iran) పై దాడులకు వీటిని రంగంలోకి దించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది.

దాదాపు వందేళ్లు సేవలు..

ఈ స్ట్రాటోఫోర్ట్రెస్‌ల ఎయిర్‌ ఫ్రేమ్‌లు 100 ఏళ్లు సేవలు అందించగలవని అమెరికా వాయుసేన అంచనా. వీటికి కొత్త ఇంజిన్లను బిగించుకొంటూ 2050 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చని ఇంపీరియల్‌ వార్‌మ్యూజియమ్స్‌ కథనంలో పేర్కొంది.

Source : Smacy News

2 hours ago

Home Flash News